ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నమోదైన కరోనా కేసులు
iraila 12, 2021
TV77తెలుగు అమరావతి:
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నమోదైన 1190 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,29,985కి చేరింది.గత 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మృతి చెందారు.తూర్పుగోదావరి,గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా,నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,998కి పెరిగింది.జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.అనంతపురంలో 19, చిత్తూరులో 219,తూర్పుగోదావరిలో 83,గుంటూరులో 117,కడపలో 69,కృష్ణాలో 164,కర్నూలులో 10, నెల్లూరులో 139,ప్రకాశంలో 121,శ్రీకాకుళంలో 48, విశాఖపట్నంలో 65,విజయనగరంలో 22,పశ్చిమగోదావరిలో 114 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.తూర్పుగోదావరిలో 2,87,832, చిత్తూరులో 2,40,695 కేసులు
నమోదయ్యాయి.అనంతపురం,గుంటూరు,కర్నూలు, నెల్లూరు, ప్రకాశం,శ్రీకాకుళం,విశాఖపట్నం,పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,608) కరోనా కేసులున్నాయి.