సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు

TV77తెలుగు హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు.సాయితేజ్ కాలర్ బోన్ కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు.సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, క్రమంగా మెరుగుపడుతోందని వెల్లడించారు.నిపుణులైన వైద్యబృందం పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స కొనసాగుతుందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.ఈ సర్జరీలో అనేక విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన బృందం పాల్గొందని తెలిపారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.