ఇబ్రహీంపట్నం మండల పరిధిలో సీజనల్ వ్యాధులు ఆందోళనకరంగా

TV77తెలుగు ఇబ్రహీంపట్నం: 

సామాన్యుల జేబులు గుంజేస్తున్నారు....!!!

 సీజనల్ వ్యాధులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలు...!! 

 ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో విజృంభిస్తున్న మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు..!!! 

 ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు....!!

ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా మెరుగైన వైద్యం కోసం ప్రవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్న ప్రజలు....!!! 

కొండపల్లి మున్సిపాలిటీ తో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిధిలో సీజనల్ వ్యాధులు ఆందోళనకరంగా వ్యాప్తి చెందుతున్నాయి.నిన్న మీ వంతు నేడు మా వంతు అన్న రీతి లో మొత్తం కుటుంబాల పై విష జ్వరాల పంజా పడుతోంది.దీంతో ప్రవేటు ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు.అయితే జ్వరాల తీవ్రత దృష్టి లో ఉంచుకొని కొన్ని ప్రవేటు ఆసుపత్రులు సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు.ప్రస్తుతం కొండపల్లి వ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల తో పాటు ప్రాణాంతక డెంగీ జ్వరాలు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.దీంతో చేసేది ఏమి లేక ప్రవేటు ఆసుపత్రులు వేసిన బిల్లులు సమర్పించుకుంటున్నారు... ఒక పక్క ఆసుపత్రి బిల్లు లతో సతమతమైపోతున్న జనం మరో పక్క రక్త పరీక్షలు, మందుల కొనుగోలు వంటి ఖర్చుల తో నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న పరిస్థితి. సాధారణ రోజుల్లో రక్త పరీక్షలకు ఇప్పుడు చేస్తున్న పరీక్షలకు అధిక వ్యత్యాసం ఉండటం తో టెస్టులకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్న దుస్థితి.మలేరియా, టైఫాయిడ్, టెస్టులకు కలిపి 800 నుండి 1000 మేర వసూలు చేస్తుండగా.ఒక్క డెంగీ టెస్టుకు మాత్రమే 800 నుండి 1000 మేర వసూల్ చేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.పెద్దల విషయం ఇలా ఉంటే ఇక చిన్న పిల్లల కు జ్వరాలు వస్తె ఇక ప్రత్యేకమైన వసూల్.. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే మొత్తం ఉచితంగా అవుతుంది అని తెలిసినా మెరుగైన వైద్యం కోసం ప్రజలు ప్రవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు... ఇదే అదునుగా కొందరు ప్రవేటు ఆసుపత్రుల వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువేత్తుతున్నాయి... ప్రవేటు వైద్యం ఉచితంగా చేయాలని ఎవరూ కోరడం లేదు కానీ ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఈ తరహా వసూల్ సమoజసం కాదని కొందరు వాదిస్తున్నారు.. ప్రభుత్వం ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రవేటు ఆసుపత్రి లో ధరలు నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రవేటు వైద్యులు సైతం వసూల్ చేయడం లో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు... 
 సత్య....
రిపోర్టర్ మైలవరం...