గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్
iraila 18, 2021
TV77తెలుగు మియాపూర్:
గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మియాపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని ముంబైకి బస్‌లో తరలించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారు. దీంతో సురేష్, కరుణాకర్‌లను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.