రాజ్యాంగేతర శక్తులకు వత్తాసు పలకడం సిగ్గుచేటు....!!
iraila 18, 2021
TV77తెలుగు మైలవరం:
రాజ్యాంగేతర శక్తులకు వత్తాసు పలకడం సిగ్గుచేటు....!!
అప్రజాస్వామ్యకంగా రౌడీ మూకలతో దాడులు చేయించి బిసిల మద్దతు లేదని చెప్పడానికి సిగ్గుండాలి....!!
వైసీపీ గుండాలు దాడిలో తీవ్రంగా గాయపడిన బిసిలు మీకు కనిపించడం లేదా....!!!
రాజకీయ ప్రయోజనాల కోసం, అధినాయకుడు మెప్పు కోసం నీతిమాలిన రాజకీయాలు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని జగన్ పాదాల దగ్గర పెడతారా...??
ఎమ్మెల్యే జోగి రమేష్ కాదు , ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా దీటైన జవాబు ఇవ్వడానికి కొండపల్లి టిడిపి నేతలు సిద్దంగా ఉన్నారు...
మైలవరం వైసీపీ బీసీ నేతల వాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కొండపల్లి మున్సిపాలిటీ మహిళా నేత ధరణికోట విజయలక్ష్మి....!!
రాజ్యాంగేతర శక్తులుగా, అప్రజాస్వామికంగా టిడిపి నేతలపై దాడులకు తెగబడిన వైసీపీ గుండాలకు ఆ పార్టీలోని బీసీ నేతలు వత్తాసు పలకడం సిగ్గుచేటని కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి మహిళా నాయకురాలు ధరణికోట విజయలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు... రౌడీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన బిసిలకు సంఘీభావం ప్రకటించాల్సిన వైసీపీ బిసి నేతలు ఆ పార్టీ నేతల దాడులను సమర్ధిస్తూ బిసిలకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు... చట్ట విరుద్ధంగా దాడులకు పాల్పడిన నేతల మెప్పు కోసం , రాజకీయ లబ్దికోసం బిసిల ఆత్మగౌరవాన్ని ముఖ్య పాదాల దగ్గర పడేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వైసీపీ గుండా లకు వైసీపీ బిసి నేతలు దాసోహం అనడం యావత్ బిసిలు అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు... మైలవరం నియోజకవర్గ పరిధిలో మండలం దాటి మాట్లాడటం చేతకాదు అంటూ మాట్లాడుతున్న వైసీపీ నేతలు సృహలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు... ఎమ్మెల్యే జోగి రమేష్ కాదు ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా దీటైన సమాధానం ఇవ్వగల సత్తా మైలవరం లోని ప్రతి టిడిపి నాయకుడు కి, కార్యకర్తలకు ఉందని చెప్పారు.. అసలు మైలవరం లో ఉన్న వైసీపీ నాయకులు మా మహిళా విభాగం నేతలకు సమాధానం ఇవ్వగలరా అంటూ ద్వజమెత్తారు....
బీసీ లపై అంత ప్రేమ ఉంటే మీ పార్టీ లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి బీసీ అభ్యున్నతికి కృషి చేస్తే యావత్ బిసిలు హర్షిస్తారని... లేదా ఇదే తరహాలో తప్పులు చేసిన మీ నాయకులను వెనకేసుకోస్తే బిసిల ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరించారు....
సత్య....రిపోర్టర్
మైలవరం