రాజమండ్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
iraila 03, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆద్వర్యంలో అద్వాన్నంగా ఉన్న రోడ్లు పై కి వచ్చి శ్రమదానం ద్వారా రోడ్లు పై మట్టి తో గోతులు పూడ్చే కార్యక్రమం చేపట్ట నున్న పవన్ కళ్యాణ్
అవినీతి మరక అంటని నాయకుడూ పవన్ కళ్యాణ్
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
అవినీతి మరక అంటని నాయకుడు పవన్ కళ్యాణ్ అని మాజీ ఎమ్మెల్సీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం రాత్రి రాజమహేంద్రవరం, వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, అనుశ్రీ సత్యనారాయణ లు హాజరయ్యారు.కందుల అతిపెద్ద కేకు కట్ చేసారు.ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అవినీతి మరక అంటని నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ఇతర దేశాలలో కూడా పండుగ లా జరుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకం వలన ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని అన్నారు. జగన్ పాదయాత్ర రోడ్ బాగున్నప్పుడూ చేయడం కాదని ఇప్పుడు చెయ్యాలని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని అన్నారు. రోడ్లు పై గర్బిణీ స్త్రీలు హాస్పిటల్ కు వెళ్ళకుండానే మధ్యలో నే డెలివరీ అయేలా రోడ్లు ఉన్నాయన్నారు. పాడైపోయిన రోడ్లు పై ప్రభుత్వం తట్టేడు మట్టి వేయడంలేదని అన్నారు. అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ రోడ్డు పైకి వచ్చి అద్వాన్నంగా రోడ్లు పై ఉన్న గోతులను మట్టి తో పూడ్చే కార్యక్రమం చేపడతారని తెలిపారు. ఆ రోజు జన సైనికులు అంతా రోడ్లు మీదకు వచ్చి శ్రమదానం చేస్తారని పేర్కొన్నారు. అప్పటికి రోడ్లు బాగుపడకపోతే ప్రత్యక్ష ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో, దేశంలో కార్యకర్తల సంక్షేమ కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని పేర్కొన్నారు. ప్రతీ క్రియాశీలక కార్యకర్తకు రూ 5 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారని తెలిపారు.జనసేన నాయకులుసిటీ ఇన్ చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు.ప్రజల కోసం పుట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. జీవితాంతం జనసేన పార్టీ లోనే ఉండి ఆయన తో పాటు పయనిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు వై.శ్రీ నివాస్ , లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ వి.వి.ఎస్. రామ చంద్ర రావు , కార్యదర్శి శ్రీనివాస రావు , జీ. శ్రీ రామ మూర్తి, బత్తిన రాజు , జాన్ సత్యనారాయణ, తేజోబత్తుల నరసింహ రావు ,ప్రసాద్,అల్లాడ రాజు,భాగ్యలక్ష్మి, తేజస్విని నాయుడు,ప్రియ పోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు భీమా పత్రాలు పంపిణీ చేశారు.