నిమజ్జనం లో అపశృతి పెద్ద కాల్వలో వ్యక్తి గల్లంతు సి ఐ ఆధ్వర్యంలో గాలింపు
iraila 20, 2021
TV77తెలుగు మండపేట:
మండపేట లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన గణేష్ నిమజ్జనం లో ఓ వ్యక్తి గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా నిమజ్జనం లో కాకుండా వేరేగా వచ్చిన అతను స్నానానికి దిగి ప్రవాహం ఉధృతి కి కొట్టుకుపోయిఉంటాడని టౌన్ సి ఐ నున్న రాజు వివరించారు. సి ఐ కథనం మేరకు మండపేట గొల్లపుంత కాలని కి చెందిన మడికి రాజు పెయింట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం మండపేట లో నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతున్న క్రమంలో రాజు పెద్ద కాల్వ వద్ద కు వెళ్ళాడు.స్నానానికి దిగాడు.ఈ లోపు ప్రవాహం కు కొట్టుకు పోతుండగా స్థానికులు గమనించి ఈత కొడుతున్నడని భావించారు. కాగా కొద్దీ సేపటికి అతని జాడ కనిపించక పోవడంతో అక్కడివారు వెతికారు. చీకటి పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సి ఐ నున్న రాజు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం నుండి జాలర్లు,ఈతగాళ్ళను రప్పించి గాలింపు చేపట్టారు.