ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా... ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయిన గేదెను ఢీకొని ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రులు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తుర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శారమ్మ,మార్తమ్మ,లింగమ్మ, వెంకటేష్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు....