బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

హైదరాబాద్.. నిజాంపేట్‌.... ఊపిరితిత్తుల్లో పెద్దతిత్తితో బాధపడుతున్న 11 నెలల బాలుడికి ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కరీంగనగర్‌కు చెందిన విజయ్‌, మమతల కుమారుడు విహాన్‌ వాత్సల్య ఊపిరితిత్తుల్లో 6సెంటీమీటర్ల పెద్దతిత్తి ఏర్పడి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆగస్టు 13న ఆస్పత్రికి రావడంతో అత్యవసరంగా ఆపరేషన్‌ చేసి దానిని తొలగించారు. ఈ నెల 16న డిశ్చార్జి చేసినట్టు ఆస్పత్రి కన్సల్టెంట్‌ పిడియాట్రిషియన్‌ డాక్టర్‌ అరవింద్‌కుమార్‌ తెలిపారు.....