వారం రోజుల్లో 28 వేల ట్రాఫిక్ తప్పిదాలు

హైదరాబాద్‌ సిటీ... రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 28,554 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అందులో 26,035 కేసులు హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారులవే కావడం గమనార్హం. ఆగస్టు 21 నుంచి 27 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపే 768మందిపై, హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న 26,035 ద్విచక్రవాహనదారులపై, సీటు బెల్ట్‌ పెట్టుకోకుండా కార్లు నడుపుతున్న 171 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా అతివేగంతో నడుపుతున్న 946మందిపై, సిగ్నల్‌ జంప్‌ చేసిన 233మంది వాహనదారులపై, ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న 27 మందిపై, కెపాసిటీని మించి ప్రయాణికులను తీసుకువెళుతున్న 32 మంది ఆటోడైవర్లపై, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్న మరో 70మందిపై కేసులు నమోదు చేశారు. వారికి రూ. 65,34,900 జరిమానా విధించారు....