సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ దర్శకుడెవరంటే..!

పాన్ ఇండియా స్టార్ క్రేజ్ రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఆఘనతను మన డార్లింగ్ దక్కించుకున్నాడు. ఒక్క బాహుబలి సినిమాతో ఏకంగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేయాలనీ టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాదు బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టేశాడు ప్రభాస్. ఏమాత్రం గ్యాప్ లేకుండా అన్ని సినిమాలను అనుకున్న టైంకు కంప్లీట్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజ ప్రభాస్‌తో రొమాన్స్ చేయనుంది. అలాగే ఈ సినిమా తర్వాత వెంటనే సలార్ సెట్‌లో అడుగు పెట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులకు గుజ్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమాతోపాటుగా ఆదిపురుష్ సినిమాను కూడా కానిచేస్తున్నాడు ఈ మిర్చిలాంటి కుర్రాడు.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడన్నది టాక్. ఇక ఈ మూవీలో లంకేశ్‌గా బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. సీతగా కృతిసనన్ కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతుంది. వీటితోపాటు అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న నాగ్ అశ్విన్ సినిమాకూడా మొదలు పెట్టేశాడు ప్రభాస్. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడట. తాజాగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హీరో ప్రభాస్ ను కలసి కథ చెప్పాడనీ, అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ టాక్....