శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో అఘోరి హల్చల్

 


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో అఘోరి హల్చల్ చేసింది. స్వామి దర్శనానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెపై నీళ్లు పోసి, సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అఘోరి మాత్రం తాను దర్శనం చేసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్తానని భీష్మించుకుని బైఠాయించడంతో ఏం చేయాలో పోలీసులు, ఆలయ అధికారులకు అర్థం కావడం లేదు.