తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు రోడ్డుపై వదిలేశాడు

 


కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. తీవ్ర వినికిడి లోపం ఉన్న ఆమెను మరో ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి (D) సోమందేపల్లిలో జరిగింది. తన బిడ్డ భోజనం తెచ్చేందుకు వెళ్లాడని ఆమె దీనంగా రోడ్డు పక్కన కూర్చుండిపోయింది. స్థానికులు ఆమెకు భోజనం, నీరు అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.