రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్యం నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు జ్వరాలు, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.