కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాక బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్లో పలువురు బహిరంగంగా మద్యం అమ్ముతున్నారు. అక్కడ పిల్లలు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో పరారైన ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. అటు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.