తిరుపతిలో వరుస బాంబ్ బెదిరింపులు.. అసలేం జరుగుతోంది?


 ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అర్ధరాత్రి బాంబు స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పేలుడుకు సంబంధించిన పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మూడ్రోజులుగా వరుస బెదిరింపులు రావడంతో నగరవాసులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.