స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్

 


పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారి కోసం ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ గైడెన్స్ నిపుణులను విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. దీనిద్వారా విద్యార్థులను ఉత్తమ భవిష్యత్ వైపు మార్గనిర్దేశనం చేసేందుకు అవకాశం ఉంటుంది. యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా టీచర్లకు కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై నేటి నుంచి 3 రోజులు విజయవాడలో శిక్షణ ఇవ్వనుంది.