నేషనల్ లెవెల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు పొందిన "ఇదండీ సంగతి" షార్ట్ ఫిలిం.

 రాజమహేంద్రవరం

వైజాగ్ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్  నిర్వహించిన నేషనల్ లెవెల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు పొందిన రాజమహేంద్రవరం  "ఇదండీ సంగతి" షార్ట్ ఫిలిం.  దర్శకుడు గంగాధర్ గడుగోయిల  మాట్లాడుతూ దేశానికి రైతే రాజు అంటాం.కానీ మన దేశంలో రైతులు అడుగు అడుగునా ఎదురుకుంటున్న ఇబ్బందులు తన చుట్టూ ఉన్న ఈ సమాజం.  రైతు పాలిట ఎలా శాపాలుగా మారి రాబంధులుగా పీక్కుని తింటున్నాయనే ఓ జీవిత సత్యాన్ని కళ్ళకు కట్టినట్టు  చాలా నాచురల్ గా చూపించారు. తూర్పుగోదావరి స్లాంగ్ను లో చక్కగా వాడి ఎమోషన్,

సెంటిమెంట్,కామెడీ టచ్ తో ఈ లఘు చిత్రం చాలా చక్కగా తీయడం జరిగింది. తాను డైరెక్ట్ చేసిన“ఇదండీ సంగతి“షార్ట్ ఫిలిమ్సెలెక్ట్ అవ్వడం ఈ చిత్రం నేషనల్ లెవెల్ లో ఫెస్టివల్స్ కు సెలెక్ట్  అయ్యి,మంచి  లఘు చిత్రంగా గుర్తింపు రావడం  చాలా సంతోషం కలిగించింద ని అన్నారు. ఇందులో నటినటులు రామకృష్ణ పులప, డి ఎస్ ఎస్ శ్రీనివాసరావు,స్వర్ణ, బ్లేడ్ బ్యాచ్ సాయి, దేవాష్య  తదితరులు ఈ సందర్బంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..త్వరలోనే ఈ కథను వెబ్ సిరీస్ గా మరింత మందికి చేరేలా రెడీ చేస్తున్నామని దర్శకుడు తెలియజేశారు.