నన్నయ్యలో పీజీ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

 


రాజానగరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంఏ, ఎం.కామ్, ఎంపీఈడీ, ఎంఎస్సీ కోర్సుల్లో భర్తీ కానీ సీట్లకు ఈనెల 17న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఏపీపీజీ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్ కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు. రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాల్లో సీట్లభర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.