కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. 'డెయిలీ మెయిల్' కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.