రాజమహేంద్రవరం అటవీ సిబ్బంది అధికారులు కన్నా జంతు వేటగాళ్లకు పులి ని పట్టించే బాధ్యతలను అప్పగించి వుంటే ఈ పాటికి పులి జాడ తెలిసేది. అని మేడ శ్రీనివాస్ అన్నారు.సిబ్బంది అధికారులను శిక్షణకు పంపి ఆ స్థానంలో నిష్టాతులను నియమించి అటవీ శాఖ ప్రతిష్టను కాపాడాలి అన్నారు. పులి ని పట్టుకుంటాం అని ప్రకటనలకే పరిమితం అవుతున్న రాజమహేంద్రవరం అటవీ సిబ్బంది అధికారులును చూస్తున్న ప్రజలు నవ్వి పోతున్నారు.పులి జాడ అన్వేషణ పేరుతో లక్షల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకుల పాలనతో ప్రజలను దురదృష్టం వెంటాడుతుంది. అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ మేడా శ్రీనివాస్ అన్నారు.