జగన్ని ఆదర్శంగా తీసుకొని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం పోయినా అరాచకాలు మాత్రం తగ్గట్లేదని మంత్రి లోకేశ్ విమర్శించారు. 'జగన్ పాలనలో నేరాలకు అలవాటైన పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ అండతో ఈవెంట్ యాంకర్ కావ్య, ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ గుండాలు దాడి చేశారు. మహిళపై దాడి చేసిన గ్యాంగ్పై చర్యలు తప్పవు' అని ఎక్స్ వేదికగా లోకేశ్ హెచ్చరించారు.