అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఓ వ్యక్తిని


రాజమహేంద్రవరం లోని అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఓ వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.వెంకటనగరం ప్రాంతానికి చెందిన ఎన్.రాకేశ్ ఆల్కట్ తోట గోదావరి గట్టుపై సారా తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న 12 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.