శ్రీ మాతృ రూపిణి సేవా సంస్థలో రమణీయంగా శ్రీ మహా కామేశ్వరి శ్రీ మహా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవం

రాజమహేంద్రవరం సీతంపేటలో శ్రీ మాతృ రూపిణి సేవా సంస్థ 35వ దసరా మహోత్సవాల్లో భాగంగా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు, భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ మహా కామేశ్వరి, శ్రీ మహా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది.ఈ కార్యక్రమాలకు ముఖ్య


అతిథులుగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, ప్రఖ్యాత వైద్యులు, వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక దంపతులు హాజరై విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు స్వీకరించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా  నృత్య రూపకాలు, ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు.