రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచారం, హత్యలు జరుగుతున్నాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో 82 లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీతో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు లబ్ధి పొందుతున్నారన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో పేద కుటుంబాలు సంక్షోభంలోకి వెళ్లాయని ఆరోపించారు.