సారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్


 రాజమహేంద్రవరం నగరంలోని ఐదు బల్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన సి. వెంకటలక్ష్మి అనే మహిళ ఇంటి వద్ద సారా విక్రయిస్తుండగా అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి ఆమె వద్ద నుంచి ఐదు లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.