బద్వేల్ ఘటనలో యువతి చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 'విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి.
మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి' అని ఆయన అధికారులను ఆదేశించారు.