పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని 'సరస్వతి పవర్' భూములకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అసలు ఆ భూములకు పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ భూముల్లో అటవీ భూమి ఎంత ఉంది, వాటిలో జల వనరులు ఏమైనా ఉన్నాయా అని ఆయన ఆరా తీశారు. సరస్వతి పవర్ భూములపై త్వరలో సమీక్షిస్తానని చెప్పారు.