సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ ప్లేయర్: సూర్య
urria 13, 2024
వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.'జట్టుకు నిస్వార్థమైన ఆటగాళ్లు అవసరం. వ్యక్తిగతంగా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా జట్టుకు అవసరమైతే హిట్టింగ్ చేయాలి. ఈ రోజు సంజూ అలాగే ఆడినందుకు సంతోషంగా ఉంది' అని ఆయన పేర్కొన్నారు.