కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలో దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్లాడారు. దీంతో 70 మందికిపైగా గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు
సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.