శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవము మరియు రధోత్సవము ఘనంగా


 TV77 తెలుగు రాజమండ్రి రూరల్ :

రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామం లో ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవము మరియు రధోత్సవము ఘనంగా జరిగాయి.బుధవారం మధ్యాహ్నం 3:15 నిమాషాలకు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి రధోత్సవము ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్,  రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాగేశ్వర్ కొబ్బరికాయ కొట్టి  భక్తులతో కలిసి రధోత్సవమును ప్రారంభించారు.చందన నాగేశ్వర్ మాట్లాడుతూ అఖండ గోదావరి నదీ తీరంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి వారి రథోత్సవము మరియు కళ్యాణ మహోత్సవము ప్రతి ఏటా లాగే ఈ నాడు కూడా ఘనంగా నిర్వహహించడం జరుగుతుందని, శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దివ్య కరుణా కటాక్షములు మన అందరకీ ఎల్లవేళలా ఉండాలని అని కోరుకున్నట్లు తెలియజేశారు.రథోత్సవాన్ని తిలకించేందుకు నలుమూల నుంచి వచ్చిన భక్తులతో ధవళేశ్వరం కిక్కిరిసింది. ఈ మహోత్సవములో  వైస్సార్సీపీ నాయకులు, మరియు కార్యకర్తలు, దేవాదాయశాఖ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు..