TV77తెలుగు రాజమండ్రి రూరల్ :
పల్ల వెంకన్న మెమోరియల్ బాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం....
పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,రూరల్ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్...
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పల్ల వెంకన్న జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజనగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం నాడు కడియం మండలం కడియపులంక గ్రామం నందు టి.ఎస్.ఎం ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం నందు పల్ల వెంకన్న మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. సందర్భంగా జక్కంపూడి రాజా, చందన నాగేశ్వర్ మాట్లాడుతూ నేడు కడియం నర్సరీలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందయంటే దాని వెనకాల పల్ల వెంకన్న కృషి ఎంతో ఉందన్నారు.పల్ల వెంకన్న జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రతి సంవత్సరం పల్ల వెంకన్న మెమోరియల్ బ్యాడ్మింటన్ పోటీలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారాన్నారు. కృషి పట్టుదల ఉంటే నమ్ముకున్న రంగాలలో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి పల్లా వెంకన్న జీవితమే ఒక చక్కటి ఉదాహరణ అన్నారు. అంగవైకల్యన్నీ కూడా లెక్కచేయకుండా నమ్ముకున్న నర్సరీ రంగం పట్ల నిరంతరం శ్రమిస్తూ ఆయన ఎంతో మందికి ఆదర్శప్రాయుడు అయ్యారాన్నారు.ఆయన చూపిన మార్గంలోనే నేడు ఎంతో మంది ప్రయాణిస్తున్నారాన్నారు.పల్ల వెంకన్న మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు మూడు రోజులు పాటు జరుగుతాయని,రాష్ట్రంలో వివిధ జిల్లాల చెందిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పల్ల వెంకన్న కుమారులు ఈ సందర్భంగా ఆయన అభినందించారు. క్రీడాకారులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్ల వెంకన్న కుమారులు సత్యనారాయణ సుబ్రహ్మణ్యం,గణపతి,పాఠం శెట్టి శ్రీనివాస్,చక్రవర్తి,కొత్తపల్లి మూర్తి,తిరుమల శెట్టి బాబు,సింగంశెట్టి శ్రీను,తదితర గ్రామాలకు సంబంధించిన గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.