స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ చర్యలు ఆపండి - ప్రజాసంఘాలు నిరసన


 TV 77 తెలుగు విశాఖపట్నం :

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ చర్యలు వెనక్కి తీసుకున్నట్టుగా మోడీ ప్రకటన చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం కాలనీలో సిఐటియు, ఐద్వా,  ప్రజానాట్యమండలి,  ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్కే ఎస్ వి కుమార్ మాట్లాడుతూ ఈరోజు మోడీ విశాఖకు  వస్తున్న సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని, 8500 మంది నిర్వాసితుల కు శాశ్వత ఉపాధి కల్పించాలనికోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో ప్రభుత్వానికి సంస్థలు మోడీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మేస్తుందని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయకుండా  రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసారని విమర్శిశించారు. ఒకపక్క రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ప్రభుత్వం దాసోహమై పనిచేస్తుందని విమర్శించారు. ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగే సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మోడీని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని విశాఖపట్నం ఉండాలంటే ప్రభుత్వ సంస్థలు,  ప్రత్యేక హోదా, విభజన హామీలు అయితేనే ప్రయోజనం కలుగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని,  రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టే పని చేయొద్దని అన్నారు. బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీని వాడుకుంటుందని అన్నారు. మోడీ ని కలవడానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా స్టీల్ ప్లాంట్ విభజన హామీలపై చర్చించాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అక్రమ అరెస్టులకు సీఐటీయూ ఖండన  

విశాఖపట్నంలో జరుగుతున్న మోడీ బహిరంగ సభకి విఘాతం కల్పిస్తారని కుంటి సాకులతో వామపక్ష పార్టీల నాయకుల ను, ట్రేడ్ యూనియన్ల నాయకులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి అక్రమంగా అరెస్టులు చేయడానికి సీఐటీయూ మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. మద్దిలపాలెం ప్రాంతంలో  ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి నిరసనలు తెలియజేయకూడదని, నిరసన తెలియజేస్తే అక్రమ కేసులు పెడతామని వాలంటీర్లు ద్వారా. పోలీస్ లు ఇంటింటికి నోటీసులు ఇవ్వడానికి సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరసన తెలియజేసే హక్కు ప్రజలందరికీ ఉందని, యూనివర్సిటీలో జరుగుతున్న బహిరంగ సభ వల్ల చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సభను ప్రజలు బహిష్కరించాలని కోరారు.శాంతియుతంగా స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్న దీక్షా శిబిరంలో ఉన్నటువంటి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిలబడితే ఈ అరెస్ట్  లు ఎందుకని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మద్దిలపాలెం జోన్ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు వి కృష్ణారావు,  పి వెంకట్రావు, ఐద్వా కార్యదర్శి కుమారి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాయుడు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఎం చంటి తదితరులు పాల్గొన్నారు.