TV77తెలుగు దేవరపల్లి :
ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దున్నా దుర్గారావు ఈరోజు గురువారం దేవరపల్లి మండలంలో పర్యటించారు. CPS రద్దు చేసేవరకూ పోరాటం చేస్తూనే ఉంటామని, GPS ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే APTF 100రోజుల పోరుబాట పట్టింది అని విజయవాడలో 13 వ తేదీ నిరసన దీక్షలో జిల్లా శాఖ పక్షాన ఉపాధ్యాయులను పెద్ద సంఖ్యలో సమీకరిస్తున్నామని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా యర్నగూడెం, త్యాజంపూడి, ద్యుమంతు గూడెం, కృష్ణంపాలెం, కొత్తగూడెం, రామన్నపాలెం పాఠశాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి. గంగరాజు, దేవరపల్లి మండల సబ్ కమిటీ సభ్యులు వేల్పుల రాంబాబు, కాగిత శ్రీనివాసు, SK బాషా తదితరులు ఉన్నారు.