TV77తెలుగు పెద్దపల్లి :
అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ (రేషన్) బియ్యం ను పెద్దపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా కేంద్రం, కూనారం రోడ్ లో గల రైస్ మిల్లు లో సుమారు 400 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ను పెద్దపల్లి ఎస్సై రాజేష్ స్వాధీనం చేసుకున్నారు.సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని అందించామని కేసు నమోదు చేసి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పట్టడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.