TV77తెలుగు వేమగిరి :
రాజమండ్రి రూరల్ వేమగిరి ఫాదర్స్ రవీంద్రకుమార్ & రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన రెవ"ఫాధర్ డి బాలశౌరి అధ్యక్షతన హోలీ ట్రినిటీ ఆర్.సి.ఎం చర్చ్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మాట్లాడుతూ కరుణ,ప్రేమ, సమానత్వం,త్యాగం మూర్తీభవించిన మానవ సంకేత రూపం ఏసు క్రీస్తు అని, హోలీ ట్రినిటీ ఆర్.సి.ఎం చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం దేవుని సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరక్టర్ భిమరెడ్డి నాగేంద్ర, రొంపిచర్ల రమేశ్, బడుగు చిన్ని, చింతపల్లి రాజ్ కుమార్, డి.రాజేష్, కొత్తపల్లి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.