TV77 తెలుగు బంటుమిల్లి :
కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నలుగురు కలిసి శుక్రవారం బావి లోని మట్టి తీసేందుకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగింది. వీరిలో ఇద్దరు బంటుమిల్లి బిఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. మరొకరు ఇంటి యజమానిగా గుర్తించారు.వీరంతా నూతిలోని మట్టి పూడిక తీసేందుకు వెళ్లి. ఊబిలో కూరుకుపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.