రైస్‌ మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు దాడి :


 TV77తెలుగు నూజివీడు :

సోమవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో రైస్‌ మిల్లు వద్ద అన్నవరం గ్రామంలో  రైస్‌ మిల్లుపై  విజిలెన్స్‌ అధికారులు దాడి చేశారు. భారీగా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో విజిలెన్స్‌ సీఐ విల్సన్‌ ఆధ్వర్యంలో నూజివీడు డీటీ జి.వెంకటేశ్వరరావు, అన్నవరం వీఆర్వో జంపాల శ్రీనివాస్‌, హనుమంతుల గూడెం వీఆర్వో గోపి తదితరులు దాడి చేసి వాహనాల్లో లోడ్‌ చేసి ఉన్న 19 టన్నులు రేషన్‌ బియ్యాన్ని, రెండు వాహనాలను స్వాధీన చేసుకున్నారు.