ముఖ్యమంత్రి వచ్చింది శుభకార్యానికి కాదు శాలువ కప్పి ఆనందించడానికి ?


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

 రాష్ట్రంలో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తూ ప్రజలు అన్ని రకాలుగా నిరాశ్రయులైన విపత్కర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చింది బాధితులకు స్వాంతన, ధైర్యం కల్పించడానికి వచ్చారు. మరి శుభకార్యానికి వచ్చినట్లు ముఖ్యమంత్రికి  సాలువా కప్పి సన్మానం చేసి ఆనందపడ్డానికి ఇది సరైన సమయం కాదని అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు  ముక్కున వేలేసుకోవడం  గమనార్హం. సంబరాలు చేసుకోవడానికి ఇది శుభకార్యం కాదు.. ముఖ్యమంత్రి వచ్చింది నష్టం అంచనా వేయడానికి, అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వడానికి మాత్రమేనని తెలిసిందే.  వరదల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, కుటుంబ పరంగా చితికిపోయి రోడ్డు మీదకు వచ్చేసాయి. సకాలంలో సంబంధిత  ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినట్లయితే 1986 వరదలలో ఆర్థికంగా చితికిపోయి ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడిన  దురదృష్టకర సంఘటలను ఈ సందర్భంగా పలువురు  గుర్తు చేసుకున్నారు.  పట్టణాలలో నివసిస్తున్న వారికి గోదావరి లంక భూముల్లో నివసిస్తున్న వారి బాధలు ఏమి తెలుస్తాయిలేనని  గుసగుసలు వినిపించాయి.