అగ్ని ప్రమాదంలో తల్లి, కూతురు సజీవదహనం


 TV77తెలుగు కోనసీమ :

దహనం కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో విషాదఘటన జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి తల్లి, కూతురు సజీవదహనమయ్యారు. మృతులు మంగాదేవి, జ్యోతిగా గుర్తించారు. జ్యోతి ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అల్లవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.