ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలి


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా

రాజమహేంద్రవరం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్ చేశారు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్న మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 30 సంవత్సరాల పైగా నిరంతర పోరాటం చేస్తున్నామని అన్నారు ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా ఉషామహర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని బిజెపి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మోడీ రాకను వ్యతిరేకిస్తూ మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మేకల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.