ఉధృత వరదల వలన అమరనాథ్ తీర్థ యాత్రలో మరణించిన భక్తుల కుటుంబాలకు తన సంతాపం ఎంపీ మార్గాని భరత్ రామ్


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

రాజమండ్రి నుండి వెళ్లి మరణించిన శ్రీమతి కొత్త పద్మావతి, శ్రీమతి గునిసెట్టి సుధ గారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన ఎంపీ భరత్.ఢిల్లీ లో వున్న ఎంపీ భరత్ ఈ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, తక్షణమే జిల్లా కలెక్టర్ గారితో, అలాగే ఢిల్లీ లో వున్న అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. వారి పార్థివ దేహాలను వీలైంత త్వరగా రాజమండ్రి వారి కుటుంబాలకు అందచేయాలని అధికారులను కోరడం జరిగింది అని తెలిపారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు వీరి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించేలా తను కోరతామని తెలిపారు. మరణించిన వారికి వారి కుటుంబాలకు తన సంతాపం వ్యక్తం చేశారు.