TV77తెలుగు అమరావతి :
ఆంధ్ర ప్రదేశ్ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీరానికి ఆనుకుని కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఇది బలపడే అవకాశం కనిపిస్తుండగా.మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.