గాస్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్ సి.యస్.ఆర్ నిధులనుండి గౌతమి జీవ కారుణ్య సంఘం అబివృద్దికి 1.50 కోట్లు - ఎంపీ భరత్


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

గౌతమీ జీవ కారుణ్య సంఘం అభివృద్ధికి గాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సి.యస్.ఆర్ నిధుల నుండి 1.50 కోట్లు కేటాయించింది.ఈ మేరకు మంజూరు పత్రాన్ని గాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్  భరత్ కి అందచేశారు.గౌతమి జీవ కారుణ్య సంఘం సమగ్ర అభివృద్ధికి రాజమండ్రి ఎంపీ భరత్ ప్రణాళికను రూపొందించారు.5 కోట్ల రూపాయల వ్యయంతో అనాధ శరణాలయం, గోశాల, వృద్దాశ్రమం అభివృద్ధికి ప్రాజెక్ట్ ను రూపొందించారు.ఈ మేరకు ఇప్పటివరకు ఎంపీలాడ్స్ నిధుల నుండి 1 కోటి రూపాయలు మంజూరు చేసి సి జి ఏం, కె వి ఎస్ రావు. సీనియర్ మేనేజర్ ఎస్, బాలాజీ. చీఫ్ మేనేజర్ ది ప్రభాకర్.లు ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు.ఇందులో భాగంగా గాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1.50 కోట్ల రూపాయలు తమ వంతుగా సి.యస్.ఆర్ నిధులు కేటాయించారు.తమ వంతు సహాయం చేసిన గాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులకు ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.