TV77తెలుగు శంకవరం:
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం శృంగదార గ్రామంలో సోమవారం రెండేళ్ల వయసు గల దూడపై దాడి చేసి చంపింది. గ్రామ శివారున గల కాకర బాలరాజు అనే రైతు పొలంలో దూడ మరణించి ఉంది. రైతులు పరిసర ప్రాంతాలను గమనించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీ శాఖ అధికారులు వాటిని చూసి పులివే అని నిర్ధారించారని గ్రామస్తులు తెలిపారు. పరిసర ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.