ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ షాక్ ఇచ్చింది


 TV77తెలుగు అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ ఒంటరి మహిళల పింఛను విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత వయస్సును35 నుంచి 50 ఏళ్లకు పెంచింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి 50 ఏళ్లు దాటితేనే సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. భర్తను వదిలి/భర్త వదిలేసి కనీసం ఏడాది దాటితేనే పింఛనుకు అర్హత ఉంటుంది. అటు కుటుంబ సహకారం అందని అవివాహిత మహిళల పింఛను అర్హత వయసును కూడా 30 నుంచి 50కి పెంచింది. వీరికి రూ.2,500 పింఛన్ అందుతోంది..