సమష్టి కృషితో పార్టీ విజయానికి కృషి చేయాలి


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

కార్పొరేషన్ వార్డుల  సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి, ఎంపీ పిల్లి బోస్ పిలుపు

పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలను విడనాడాలని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీ విజయానికి సమిష్టి  కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాలో భాగంగా రెండు రోజుల పాటు జరిగే వార్డుల సమీక్షా సమావేశంలో భాగంగా స్థానిక ఎంపీ కార్యాలయంలో మంగళవారం 17 వార్డుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో పిల్లి బోస్ మాట్లాడుతూ ,కార్పొరేషన్ ఎన్నికలో  విజయం సాధించడం పార్టీకి ప్రతిష్టాత్మక మన్నారు. వర్గ విభేదాలు వీడాలని సమస్యలేమైనా ఉంటే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. 52 వార్డు లోనూ పార్టీ విజయం సాధించాలని ఆయన అన్నారు. నగర కోఆర్డినేటర్, ఎంపీ మిదున్ రెడ్డి మాట్లాడుతూ ,కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వడం జరుగుతుందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సేవలు , అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరైనాప్పటికి పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతివారు పని చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ,పార్టీకి సేవలు అందించిన వారికి, కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఒత్తిళ్లకు , ప్రలోభాలకు సీట్లు కేటాయించే విధానం ఉండదని సమిష్టి కృషితో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, వార్డుల వారీగా సమర్థులైన అభ్యర్థుల ఎన్నిక జరుగుతుందని సామాజిక ఆర్థిక రాజకీయ కోణంలో రిజర్వేషన్ల ప్రకారమే అభ్యర్థులు ఎంపిక ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ ,రూరల్ కోఆర్డినేటర్ చంద్రన  నాగేశ్వర్, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మార్తి లక్ష్మి నాగేశ్వరరావు, పాలిక శీను, నరవ గోపాలకృష్ణ, రామ శర్మ,జిగ్లెర్, టి విశేస్వరరెడ్డి, గుత్తుల భాస్కర్ రావు, నందేపు శ్రీను, యర్ర ప్రసాద్ రావు,అరిఫ్ తదితరులు పాల్గొన్నారు.