కడియపులంక సత్యదేవా నర్సరీ లో విరిసిన పర్యావరణ దినోత్సవం


 TV77తెలుగు కడియం :

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం లో  పచ్చని చెట్టులో ప్రపంచ ప్రగతి ఉంది..పర్యావరణ హితందాగింది.అందుకు ఆలవాలమైన కడియం నర్సరీ ప్రాంతంలో పర్యావరణ దినోత్సవం విరిసింది.కడియం నర్సరీ మేన్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా చంటికి చెందిన  కడియపులంక సత్యదేవా నర్సరీ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందడి నెలకొంది.  కొన్ని వేల మొక్కలతో టైం ఫర్ నేచర్ ,థింక్ గ్రీన్ అంటూ అక్షర నినాదాలిస్తూ అద్భుతమైన వృక్షాన్ని లక్ష మొక్కలతో కాన్వాస్ గా రూపొందించారు. గుండ్రని భూగోళంలో దేశ చిత్ర పఠాలన్నీ ఆచెట్టు పచ్చదనంలో ఇమిడినట్లు మొక్కల కూర్పు చేశారు.ఈ ఆకృతి రూపకల్పన ఎంతో శ్రమ,వ్యయంతో  కూడుకున్నప్పటికీ సత్యదేవా నర్సరీ యాజమాన్యం పర్యావరణం పట్ల వారికున్న భాధ్యతను తెలియబరుస్తు పర్యావరణ దినోత్సవ సందేశాన్ని మొక్కలతో అందించారు. కడియం నర్సరీలు పర్యావరణానికి మెట్లు అని నర్సరీ యజమాని పుల్లా పెద సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు.పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించడం ప్రతీ ఒక్కరు భాద్యత ని.దీనిలో భాగంగానే బోర్డుర్ రకాల మొక్కలతో సందేశంతో కూడిన పచ్చని ఆకృతిని ఏర్పాటు చేశామన్నారు.