పథకం రద్దు.. క్లారిటీ


 TV77తెలుగు అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ఫ్యాక్ట్ఛిక్ టీం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 2022 ఏడాదికి గాను ఈ రెండు పథకాలు రద్దు చేసినట్లు కొందరు ఫేక్ ప్రెస్నోట్ సృష్టించారని తెలిపింది. వాళ్లను గుర్తించామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఫ్యాక్ట్ చెక్ టీం స్పష్టం చేసింది.