TV77తెలుగు నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి శరణ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం స్థానికులు శరణ్యను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తలిరంచారు. బైక్‌ను ఢీకొట్టి వాహనం ఆపకుండానే వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి.వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులు: దంపతులు కృష్ణ, రజిత, కూతురు రాగిణిగా పోలీసులు గుర్తించారు.